న్యూఢిల్లీ : అమెరికా వీసా ఒక ప్రత్యేక సౌకర్యం మాత్రమేనని, హక్కు కాదని భారత్లోని యూఎస్ ఎంబసీ స్పష్టంచేసింది. అమెరికా చట్టాల్ని అతిక్రమిస్తే వీసా రద్దుతోపాటు, దేశం నుంచి బహిష్కరణ, భవిష్యత్తులో మళ్లీ రాకుండా నిషేధం వంటి కఠిన చర్యలు ఉంటాయని ఎంబసీ హెచ్చరించింది.
అమెరికాకు వస్తున్న భారతీయ విద్యార్థులను ఉద్దేశించి యూఎస్ ఎంబసీ బుధవారం ఓ అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా వీసా అనేది.. దేశంలోకి ప్రవేశం కల్పించే అర్హత మాత్రమేనని పేర్కొన్నది. అమెరికాలో ఉంటూ చట్టాల్ని ఉల్లంఘించి అరెస్టు అయితే దేశ బహిష్కరణ తప్పదని స్పష్టం చేసింది. వీసాల జారీని ట్రంప్ సర్కారు కఠినతరం చేస్తున్న క్రమంలో అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక చేసింది.