US Pacific Command | పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో పేరు తొలగింపు.. పీవోకేను పాక్‌లో చూపిస్తూ మ్యాప్.. భారత్‌కు అమెరికా షాక్
US Pacific Command | అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అంటూ పదేపదే ప్రకటించే అమెరికా.. జీ7 సమావేశాల వేళ గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ తన అసలు పేరు యూఎస్ పపిఫిక్ కమాండ్‌కు అధికారికంగా తిరిగి మారుతుందని అమెరికా యుద్ధ శాఖ ప్రకటించింది.
US Pacific Command | న్యూఢిల్లీ, జూన్ 17 : అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అంటూ పదేపదే ప్రకటించే అమెరికా.. జీ7 సమావేశాల వేళ గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ తన అసలు పేరు యూఎస్ పపిఫిక్ కమాండ్‌కు అధికారికంగా తిరిగి మారుతుందని అమెరికా యుద్ధ శాఖ ప్రకటించింది. తద్వారా ఏడు దశాబ్దాలకు పైగా ఈ సైనిక విభాగం పనిచేసిన ఆ పాత పేరును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన కార్యకలాపాల పరిధికి సంబంధించి ఆ కమాండ్ తన అధికారిక వెబ్సైట్లో భారతదేశానికి చెందిన తప్పులతడకల మ్యాప్‌ను కూడా ప్రదర్శించింది.
యూఎస్పీఏసీవోఎం వెబ్సైట్ తన బాధ్యతాయుత ప్రాంతం మ్యాప్ విభాగంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే)ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించింది. ఫ్రాన్స్‌లో జీ7 దేశాల నాయకుల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న తరుణంలోనే అమెరికాకు చెందిన ఇండో-పసిఫిక్ కమాండ్ తన పేరును తిరిగి అమెరికా యూఎస్ పసిఫిక్ కమాండ్‌గా మార్చుకుంది. 1947లో అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్ హయాంలో ఈ కమాండ్ ఏర్పడిన నేపథ్యాన్ని గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొన్నది. అయితే భారత మ్యాప్‌ను తప్పుగా చూడడం వివాదంగా మారింది.
మారుతున్న ప్రాధాన్యత?
జీ7 దేశాలు తైవాన్ జలసంధి అంతటా శాంతి, స్థిరత్వానికి తరచుగా మద్దతు తెలుపుతూ బలప్రయోగం లేదా ఒత్తిడితో యథాతథ స్థితికి ఏకపక్ష మార్పులను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలో తైవాన్ ఒక కీలక భాగంగానే ఉన్నప్పటికీ అమెరికా కమాండ్ పేరు మార్చడం తైవాన్‌లో కొంత ఆందోళనను సృష్టించడం ఖాయం. భారత్‌కు సంబంధించి ‘ఇండో’ పేరును తొలగించడంతో కొత్త నామకరణం కారణంగా క్వాడ్‌పై పడబోయే ప్రభావాల గురించి కొంతమంది పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

