అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు
భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ దావాతో అమెరికా విదేశాంగ శాఖ భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది.
- తన హత్యకు కుట్ర పన్నారంటూ పన్నూన్ దావా
న్యూఢిల్లీ, నవంబర్ 10 : భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ దావాతో అమెరికా విదేశాంగ శాఖ భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఈ దావాలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ చీఫ్ సామంత్ గోయల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) తరఫు న్యాయ సలహాదారు అయిన పన్నూన్ తనపై హత్యాయత్నం జరిగిందంటూ నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా దాఖలు చేశారు.
తనను హత్య చేసేందుకు భారతదేశపు విదేశీ నిఘా సంస్థ ‘రా’తో కలిసి దోవల్ కుట్రపన్నారని పన్నూన్ ఆరోపించారు. ఈ నోట్‌ను విధానపరమైన చర్యేనని పన్నూన్ దావాను అనవసరమైనది, నిరాధారమైనదిగా భారత్ అభివర్ణించింది. హత్య కుట్రతో అధికారులకు సంబంధం ఉందన్న ఆరోపణలను నిర్దంద్వంగా తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

