వాట్సాప్‌నకు సుప్రీంకోర్టు నోటీసు
డిజిటల్ అరెస్ట్ స్కాములు, సంబంధిత సైబర్ క్రైమ్‌లను నిరోధించేందుకు ఎటువంటి చర్యలను తీసుకుంటారో చెప్పాలని వాట్సాప్‌తోపాటు ఇతర ఆన్లైన్ ఇంటర్మీడియరీలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
- ‘డిజిటల్ అరెస్ట్’కట్టడికి చర్యలు సూచించాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : డిజిటల్ అరెస్ట్ స్కాములు, సంబంధిత సైబర్ క్రైమ్‌లను నిరోధించేందుకు ఎటువంటి చర్యలను తీసుకుంటారో చెప్పాలని వాట్సాప్‌తోపాటు ఇతర ఆన్లైన్ ఇంటర్మీడియరీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ప్రతిపాదనలను ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కి సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరుగుతుంది. డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరుపుతున్నది. వాట్సాప్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని ఆ కంపెనీ తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ చెప్పారు.
9,400 ఖాతాలపై చర్య తీసుకుందన్నారు. అనుమానాస్పద ఖాతాలను గుర్తించేందుకు, యూజర్లను హెచ్చరించేందుకు సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ అరెస్ట్ స్కాములు, సైబర్ మోసాలకు ఆర్థిక సంస్థలను జవాబుదారీ చేస్తామని సుప్రీంకోర్టు గత నెల 29న జరిగిన విచారణ సందర్భంగా హెచ్చరించింది. ముందు జాగ్రత్తల్లో విఫలమైతే బాధితులకు బ్యాంకులు నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

