చినుకల్లే జారే మేఘమే..
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులకు ఎంతో చేరువైన మిత్రబృందం మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నది.
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులకు ఎంతో చేరువైన మిత్రబృందం మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. తరుణ్‌భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ముఖ్య పాత్రధారులు. మంగళవారం ఈ సినిమా నుంచి ‘మిత్వా’ అనే పాటను విడుదల చేశారు.
‘చిరుగాలే చేరే నీలాకాశమే..చినుకల్లే జారే సాగే మేఘమే’ అంటూ స్నేహబంధంలోని అందమైన అనుభూతులకు దర్పణంలా ఈ పాట సాగింది. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ పాటను భరద్వాజ్ గాలి రచించారు. నకుల్ అభ్యంకర్, వీణా ఘంటశాల ఆలపించారు. థాయ్‌లాండ్ విహార యాత్రలో మిత్రబృందం చేసే హంగామా, సరదాగా గడిపిన క్షణాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి, రచన-దర్శకత్వం: తరుణ్‌భాస్కర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

