లోన్ యాప్ వేధింపులు తాళలేక..
లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
-
కానిస్టేబుల్ బలవన్మరణం..పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో ఘటన
పహాడీషరీఫ్, నవంబర్ 10: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలోని హర్షగూడ ప్రాంతానికి చెందిన ముదావత్ శ్రీను నాయక్ (31) కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీను నాయక్‌కు గత సంవత్సరమే పెళ్లి జరిగినట్లు సమచారం. కాగా, వ్యక్తిగత అవసరాల కోసం లోన్‌యాప్ ద్వారా శ్రీను నాయక్ రూ.40వేలు అప్పుగా తీసుకున్నాడు.
రోజూవారి చెల్లింపులతోపాటు వారాంతపు చెల్లింపుల హామీతో లోన్ తీసుకోగా కొన్ని వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో లోన్‌యాప్ నిర్వాహకులు దీపావళి రోజు నుంచి ప్రతి గంటకు ఫోన్ చేసి పెండింగ్ బకాయిలు చెల్లించాలని వేధింపులు ప్రాంరభించారు. అంతటితో ఆగకుండా శ్రీను వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్ చేసి.. నగ్న ఫోటోలను అతని బంధువులతోపాటు గ్రామంలోని అతని స్నేహితులకు పంపించారు. ఈ పరిణామాలతో మనస్థాపానికి గురైన శ్రీను సోమవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయరణ, ఎస్ఐ వినోద్‌రెడ్డి..ఘటనాస్థలంలో వివరాలను సేకరించారు. మృతుడి తల్లి గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోన్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

