Watch: దుర్గా పూజా మండపాన్ని సందర్శించిన అమెరికా రాయబారి ఎరిక్.. డ్యాన్స్ చేస్తూ సందడి
US Envoy Eric Garcetti | భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) దుర్గా మాతా పూజా మండపాన్ని సందర్శించారు. దేవతా విగ్రహానికి హారతి ఇవ్వడంతోపాటు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతో సందడిగా గడిపారు.
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) దుర్గా మాతా పూజా మండపాన్ని సందర్శించారు. దేవతా విగ్రహానికి హారతి ఇవ్వడంతోపాటు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతో సందడిగా గడిపారు. ఢిల్లీలోని సీఆర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన దుర్గా పూజ పండాల్‌కు వెళ్లిన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టిని గౌరవ మర్యాదలతో నిర్వాహకులు ఆహ్వానించారు. ఆయనకు హారతి ఇచ్చి, నుదుడిపై తిలకం దిద్ది సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
కాగా, మండపంలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి విగ్రహానికి ఎరిక్ గార్సెట్టి పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి వారితో కలిసి నోటితో దీపం పట్టుకుని డ్యాన్స్ చేశారు. పిల్లల డ్యాన్స్ ప్రదర్శనను చూసి వారిని అభినందించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన పలు ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఎరిక్ గార్సెట్టి సందర్శించారు. బిర్యానీతోపాటు పలు రకాల స్వీట్లు రుచి చూశారు. అక్కడున్న పలువురితో సెల్ఫీలు దిగారు.
మరోవైపు పండాల్లో సందడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో ఎరిక్ పోస్ట్ చేశారు. భారత్‌కు చెందిన అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యానికి విస్మయం చెందినట్లు పేర్కొన్నారు. ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ అంటూ ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దీనికి ముందు ఎరిక్ గార్సెట్టి గురువారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. తొలిసారి ఢిల్లీ మెట్రోలో రైడ్ చేసినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే తోటి ప్రయాణికులను కలవడం చాలా ఆనందంగా ఉందని ఆ పోస్ట్‌లో తెలిపారు.
https://twitter.com/USAmbIndia/status/1715728376131207278?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715728376131207278%7Ctwgr%5E4672ab268a3653a038bceca851287282079ffd3f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Findia%2Fdelhi-us-envoy-eric-garcetti-visits-durga-puja-pandal-in-cr-park-performs-dhunuchi-naach-watch
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

