Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వినరో భాగ్యం విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తోనే అఖిల్ ఈ సినిమాలో విభిన్నమైన మాస్ పాత్రలో కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో షూటింగ్ స్టేటస్, రిలీజ్ టైమ్‌లైన్‌పై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.
సోషల్ మీడియాలోనూ ఏదొక అప్డేట్ ఇవ్వాలని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్ ఇచ్చారు. అడగకుండానే మాట్లాడిన ఆయన, మరికొద్ది రోజుల్లోనే ‘లెనిన్’ ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అంతేకాదు, సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోందని, వచ్చే ఏడాది మార్చిలో మూవీని విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.నాగవంశీ వ్యాఖ్యలతో అక్కినేని అభిమానుల్లో జోష్ పెరిగిపోయింది.
నిర్మాత మాటల్ని బట్టి చూస్తే అఖిల్ కెరీర్లో ఇదే ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు మూడు రోజుల్లో ‘లెనిన్’కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందా? అఖిల్ నుంచి మాస్ సర్ప్రైజ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, అఖిల్ కెరియర్లో ఇప్పటి వరకు మంచి హిట్ ఒక్కటి లేదు. పెళ్లి తర్వాత అఖిల్ నుండి వస్తున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీతో మనోడు మంచి హిట్ దక్కించుకుంటాడా, అక్కినేని ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్లో మంచి ట్రీట్ ఇస్తాడా అనేది చూడాలి.