HIL 2025-26 : మహిళల హాకీ ఇండియా లీగ్ (Hockey India League 2025-26) రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని నిమిషాల్లో రాంచీ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే.. తొలి సీజన్ ఛాంపియన్ ఒడిశా వారియర్స్ (Odisha Warriors) ఈసారి బరిలోకి దిగడం లేదు. ఈ జట్టు స్థానంలో రాంచీ రాయల్స్(Ranchi Royals) ఆడనుంది. దాంతో.. ఇప్పుడు కూడా నాలుగు జట్లు ట్రోఫీకోసం నువ్వానేనా అన్నట్టు తలపడనున్నాయి. రాంచీ రాయల్స్, ఎస్జీ పైపర్స్, జేఎస్‌డబ్ల్యూ సూర్మ హాకీ క్లబ్, శ్రచి బెంగాల్ టైగర్స్ జట్లు టైటిల్ వేటకు సిద్ధంగా ఉన్నాయి.
రాంచీ వేదికగా మహిళల హాకీ ఇండియా లీగ్ రెండో సీజన్ రోజు (డిసెంబర్ 28) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో రాంచీ రాయల్స్, ఎస్జీ పైపర్స్ జట్లు తలపడనున్నాయి. నాలుగు జట్లు ఒక్కోటి మరో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. అనంతరం టాప్ -2 జట్ల మధ్య టైటిల్ పోరు జరుగుతుంది. జనవరి 10న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.
𝕄𝕒𝕥𝕔𝕙𝕕𝕒𝕪 𝕚𝕤 𝕙𝕖𝕣𝕖🏑
It’s time to bring the noise! 📣Watch the opening ceremony live on Doordarshan Sports, 6:30 PM onwards
Hero Hockey India League, starts today, 7PM onwards only on Sony Ten 1 || Sony Ten 3 Hindi || Doordarshan Sports || Waves || Youtube… pic.twitter.com/vY3PtcEuRU
— Hockey India League (@HockeyIndiaLeag) December 28, 2025
డిసెంబర్ 28 – రాంచీ రాయల్స్ vs ఎస్జీ పైపర్స్, రాత్రి 7:30 గంటలకు రాంచీలో.
డిసెంబర్ 29 – సూర్మ హాకీ క్లబ్ vs శ్రచి బెంగాల్ టైగర్స్, రాత్రి 7:30 గంటలకు రాంచీలో.
డిసెంబర్ రాంచీ 30 – రాంచీ రాయల్స్ vs శ్రచి బెంగాల్ టైగర్స్, రాత్రి 7:30 గంటలకు రాంచీలో.
డిసెంబర్ 31 – ఎస్జీ పైపర్స్ v s సూర్మ హాకీ క్లబ్, రాత్రి 7:30 గంటలకు రాంచీలో.
జనవరి 1 ఎస్జీ పైపర్స్ vs శ్రచి బెంగాల్ టైగర్స్, రాత్రి 7:30 గంటలకు రాంచీలో.
జనవరి 2 రాంచీ రాయల్స్ vs సూర్మ హాకీ క్లబ్, రాత్రి 7:30 గంటలకు రాంచీలో.
𝓣𝓱𝓮 𝓰𝓻𝓲𝓷𝓭 𝓫𝓮𝓯𝓸𝓻𝓮 𝓽𝓱𝓮 𝓰𝓵𝓸𝓻𝔂💪
Hero Hockey India League, starts today, 7PM onwards only on Sony Ten 1 || Sony Ten 3 Hindi || Doordarshan Sports || Waves || Youtube
YouTube – https://t.co/38VhzTsRP6#HeroHockeyIndiaLeague #BigIsBack #indiakagame pic.twitter.com/Y6ciutW8S7
— Hockey India League (@HockeyIndiaLeag) December 28, 2025
జనవరి 3 సూర్మ హాకీ క్లబ్ vs ఎస్జీ పైపర్స్, సాయంత్రం 5:30 గంటలకు రాంచీలో.
జనవరి 4 శ్రచి బెంగాల్ టైగర్స్ vs రాంచీ రాయల్స్, సాయంత్రం 4 గంటలకు రాంచీలో.
జనవరి 5 సుర్మ హాకీ క్లబ్ vs రాంచీ రాయల్స్, సాయంత్రం 6 గంటలకు రాంచీలో.
జనవరి 6 ఎస్జీ పైపర్స్ vs శ్రచి బెంగాల్ టైగర్స్, సాయంత్రం 6 గంటలకు రాంచీలో.
జనవరి 7 శ్రచి బెంగాల్ టైగర్స్vs సుర్మ హాకీ క్లబ్, సాయంత్రం 4 గంటలకు రాంచీలో.
జనవరి 8 – ఎస్జీ పైపర్స్ vs రాంచీ రాయల్స్, సాయంత్రం 6 గంటలకు రాంచీలో.
జనవరి 10 – ఫైనల్ – రాత్రి 8:15 గంటలకు, రాంచీలో.
Hockey India League Starts Today
Women’s Hockey India League 2025-26
4 Teams
13 Matches1 Winner #Hockey pic.twitter.com/Z372vF9lDa
— IndiaSportsHub (@IndiaSportsHub) December 28, 2025