న్యూఢిల్లీ: భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం 2 వేలకు పైగా వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. ‘బ్యాడ్ యాక్టర్స్(బాట్స్)’ అపాయింట్మెంట్ సిస్టమ్ ద్వారా తప్పుడు చర్యలతో వీసా నిబంధనలను ఉల్లఘించిన దరఖాస్తుదారులపై ఈ మేరకు చర్యలు తీసుకుంది.
‘భారత్‌లోని మా టీమ్ 2 వేలకు పైగా వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. మా షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించిన ఏజెంట్లు, ఫిక్సర్లపై మేము ఎలాంటి కనికరం చూపించం’ అని భారత్‌లోని యూఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్‌లో పేర్కొంది. కొన్నేండ్లుగా విద్యార్థి వీసాల మంజూరులో తగ్గుదల కనిపిస్తున్నది.