న్యూఢిల్లీ: యూపీఎస్సీ పరీక్షలో మరో వివాదం(UPSC Controversy) బయటపడింది. ర్యాంక్ హోల్డర్ పూర్ చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. ఆల్ ఇండియా ర్యాంక్‌లో ఆమెకు 533 ర్యాంక్ వచ్చింది. తన ర్యాంక్ వివరాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమెపై విమర్శలు గుప్పుమన్నాయి. ఓబీసీ-నాన్ క్రీమీ లేయర్ కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోల్లో పూర్వ చౌదరీ చాలా లగ్జరీగా ఉన్నట్లు కనిపించింది. 4 లక్షల ఖరీదైన బ్యాగ్‌ను ఆమె ధరించింది. అంతర్జాతీయ ట్రిప్‌లకు కూడా వెళ్లినట్లు తన ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఆమె తండ్రి ఏడీఎం. అయితే ఆమె ఎలా ఓబీసీ-ఎన్సీఎల్ సర్టిఫికేట్ వాడిందని నెటిజన్లు ప్రశ్నించారు. యూపీఎస్సీలో మరో కోటా స్కామ్ జరిగినట్లు కొందరు ఆరోపించారు.
ఓబీసీ కోటా కింద పూర్వ చౌదరీ సెలెక్ట్ అయినా.. ఇన్‌స్టా అకౌంట్ ఫోటోలు ఆమె విలాస జీవితాన్ని ప్రతిబింబింప చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రిజర్వేషన్ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో.. పూర్వ చౌదరీ తన ఇన్‌స్టా అకౌంట్‌ను డిజైబుల్ చేసింది. దాంట్లోని ఫోటోలను డిలీట్ చేసింది.
పూర్వ తండ్రి పేరు ఓం ప్రకాశ్ సహరన్. ఆయన రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో ఆఫీసర్. తన కుమార్తెను ఆయన డిఫెండ్ చేసకున్నారు. 44 ఏళ్ల వయసులో ఆర్ఏఎస్ ఆఫీసర్‌ను అయ్యానని, కాబట్టి తన కుమార్తె సర్టిఫికేట్‌ను దుర్వినియోగం చేయలేదనట్లే అవుతుందన్నారు. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో అదనపు జిల్లా కలెక్టర్‌గా సహరన్ చేస్తున్నారు.
కోటా అర్హతల గురించి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని పూర్వ తండ్రి ఆరోపించారు. క్లాస్ వన్ గవర్నమెంట్ పోస్టుల్లో ప్రమోషన్ పొందిన లేదా అపాయింట్ అయిన వారికి మాత్రం అనర్హత రూల్స్ వర్తిస్తాయన్నారు. తన కూతురిది ఆ కేసు కాదన్నారు.