న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘ప్రతిభ సేతు’ను ప్రారంభించింది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అత్యున్నత స్థాయి ప్రతిభను ప్రదర్శించేవారిని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలతో అనుసంధానం చేయడానికి ఇది దోహదపడుతుంది.
గతంలో అమలైన పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ (పీడీఎస్)ను తాజాగా ప్రతిభ సేతుగా మార్చింది. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, తుది మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన నాన్ రికమెండెడ్ విల్లింగ్ క్యాండిడేట్స్ వివరాలను ప్రతిభ సేతులో ఉంచుతారు. వీరు కూడా దాదాపు ప్రతిభావంతులేనని యూపీఎస్సీ అధికారులు తెలిపారు.