న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సెప్టెంబరులో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైనవారి రోల్ నంబర్లను upsc.gov.in లేదా upsconline.nic.in వెబ్సైట్లలో చూడొచ్చు.
అభ్యర్థులు ఈ వెబ్సైట్లను సందర్శించి, తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కోసం ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత షెడ్యూలు వివరాలను యూపీఎస్సీ త్వరలో తెలియజేస్తుంది. ఇంటర్వ్యూలు న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్, ధోల్పూర్ హౌస్లో ఉన్న యూపీఎస్సీ కార్యాలయంలో జరుగుతాయి.