బెంగుళూరు: ఏడేళ్ల క్రితం ఇస్రో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్వీ-37(PSLV-37 Rocket) రాకెట్ ద్వారా నింగిలోకి 104 ఉపగ్రహాలను పంపారు. ఇప్పుడు ఆ రాకెట్ మళ్లీ భూ వాతావరణంలోకి సురక్షితంగా వచ్చేనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. 2017 ఫిబ్రవరి 15వ తేదీన పీఎస్ఎల్వీ-సీ37ను లాంచ్ చేశారు. దాంట్లో కార్టోశాట్-2డీని ప్రధాన పేలోడ్గా తీసుకెళ్లారు. 103 శాటిలైట్లను కో-ప్యాసింజెర్స్గా తీసుకెళ్లారు. 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపి ఆ పరీక్ష ద్వారా ఇస్రో చరిత్ర సృష్టించింది.
శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యలో విడిచిపెట్టిన తర్వాత.. ఆ రాకెట్‌కు చెందిన అప్పర్ స్టేజ్ పీఎస్4 కూడా కక్ష్యలోనే ఉండిపోయింది. ఆ స్సేస్ విడిభాగాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. ప్రస్తుత ఆర్బిటాల్ ఆల్టిట్యూడ్ తగ్గిపోయింది. భూ వాతావరణంలో ఉన్న ఆయష్కాంత శక్తి క్షీణించింది. అక్టోబర్ ఆరో తేదీన పీఎస్ఎల్వీ రాకెట్ రీ ఎంట్రీ ఇచ్చినట్లు ఇస్రో అధికారులు చెప్పారు. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఆ రాకెట్ కూలినట్లు భావిస్తున్నారు.
అంతర్జాతీయ డెబ్రిస్ మిటిగేషన్ సూత్రాల ప్రకారం రాకెట్ భూ వాతావరణంలోకి రీ ఎంట్రీ అయినట్లు ఇస్రో ప్రకటనలో తెలిపింది.
PSLV-C37’s upper stage, from the historic launch of 104 satellites, re-entered Earth’s atmosphere 🌍 on 6th Oct 2024 within 8 years of launch! Impact in the Atlantic Ocean 🌊. ISRO leads space debris management 🌠 #SpaceDebris and the way to cleaner space! 🚀
For more information… pic.twitter.com/rISMkHVmEH— ISRO (@isro) October 8, 2024