శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 11:12:08

UPI యూజ‌‌ర్ల‌కు గ‌మ‌నిక‌.. ఆ టైమ్‌లో పేమెంట్స్ చేయొద్దు

UPI యూజ‌‌ర్ల‌కు గ‌మ‌నిక‌.. ఆ టైమ్‌లో పేమెంట్స్ చేయొద్దు

న్యూఢిల్లీ : యూపీఐ ద్వారా డిజిట‌ల్ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక‌. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ)ని అప్‌గ్రేడ్ చేస్తున్న నేప‌థ్యంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్ల‌వారుజామున 3 గంట‌ల మ‌ధ్య‌లో పేమెంట్స్ చేయొద్ద‌ని నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) సూచించింది. అయితే అది ఎన్ని రోజుల‌నేది ఎన్‌పీసీఐ చెప్ప‌లేదు. కొద్ది రోజుల పాటు యూజ‌ర్లు అసౌక‌ర్యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. చెల్లింపుల విష‌యంలో ముందే ప్లాన్ చేసుకోవాల‌ని సూచించింది. 

VIDEOS

logo