లక్నో: మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా.. అయితే అప్లయ్ చేసుకోండి. అయితే దరఖాస్తుతోపాటు రూ.11 వేలు ఇవ్వండి. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌కు పంపించండి. అప్పుడే మీ అప్లికేషన్‌ను పరిశీలిస్తాం. ఈ ప్రకటన చేసింది ఏ గల్లీ పార్టీయో అనుకుంటున్నారా. కాదండీ బాబు.. వందేండ్ల చరిత్ర కలిగి కాంగ్రెస్ పార్టీ.
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తం 403 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలపనుంది. దీనికోసం కార్యాచరణ ప్రారంభించింది. ఇదులో భాగంగా ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్న దరఖాస్తు చేసుకోవాలని పార్టీ రాష్ట అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ఆశావహులకు సూచించారు. అయితే దరఖాస్తుతో పాటు రూ.11 వేలు బ్యాంకులో జమచేయాలని షరతు విధించారు. ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.
Uttar Pradesh Congress Committee president Ajay Kumar Lallu has asked party ticket seekers to donate Rs 11000 along with their applications for the Assembly polls, till Sept 25 pic.twitter.com/3o79rtcyl4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2021
వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షమైన శివసేన కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించింది. ఇక ప్రధాన ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ కూడా తాము ఎవరికి వారిగానే పోటీచేస్తామని స్పష్టం చేశాయి. కాగా, ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ కూడా బరిలోకి దిగనుంది.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 403 స్థానాల్లో ఆ పార్టీ 312 చోట్ల గెలుపొందింది. అయితే సీఎం యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యంలో ఈసారి ఆ పార్టీ మరోసారి తిరుగులేని విజయం సాధింస్తుందా అనేది చూడాలి.