సొరేన్ ‘అనర్హత’పై ఉద్దేశపూర్వక లీకులు
శాసనసభ్యుడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్పై అనర్హత వేటు అంశానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా బయటకు వస్తున్న లీకులను యూపీఏ బృందం ఆక్షేపించింది. రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్‌తో యూపీఏ నేతలు గురువారం సమావేశమయ్యారు
- గవర్నర్‌ను కలిసిన యూపీఏ నేతలు
రాంచీ, సెప్టెంబర్ 1: శాసనసభ్యుడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్పై అనర్హత వేటు అంశానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా బయటకు వస్తున్న లీకులను యూపీఏ బృందం ఆక్షేపించింది. రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్‌తో యూపీఏ నేతలు గురువారం సమావేశమయ్యారు. అటువంటి సెలెక్టివ్ లీకు లు గందరగోళం, అస్పష్టత, అనిశ్చితి సృష్టిస్తాయని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
సొరేన్పై అనర్హత వేటు వేయాలంటూ ఈసీ చేసిన సిఫారసుపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సొరేన్ భవితవ్యంపై జరుగుతున్న ప్రచారం.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఒకవేళ సీఎం సొరేన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై వేటు పడినా, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం పడదని, అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉన్నదని యూపీఏ నేతలు అభిప్రాయపడ్డారు. మైనింగ్ లీజు వ్యవహారంలో సొరేన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సిఫారసుపై గవర్నర్ ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోని విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

