Viral News | ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కొందరు విద్యార్థులు మితిమీరి ప్రవర్తించారు. క్లాస్ రూమ్‌లోనే బరితెగించి ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే లైంగిక వేధింపులకు గురిచేశారు. మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేశారు.
మీరట్‌లోని ఓ పాఠశాలలో నలుగురు మైనర్ విద్యార్థులు మహిళా టీచర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. క్లాస్‌రూమ్‌లోనే టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వెకిలిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా అసభ్యకర సైగలు చేస్తూ వీడియో తీశారు. విసిగిపోయిన సదరు ఉపాధ్యాయురాలు విద్యార్థులను హెచ్చరించింది. ఇలా చేయడం తప్పు అంటూ విద్యా బుద్ధులు నేర్పే ప్రయత్నం చేసింది. అయినా వారు వినలేదు. హద్దులు మీరి క్లాస్ రూమ్‌లోనే ఆమెకు ‘ఐ లవ్ యూ.. మేరీ జాన్’ అంటూ.. అసభ్యకరంగా ప్రవర్తించారు.
దీంతో సహనం కోల్పోయిన టీచర్.. ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్లాస్ రూంలోనే మైనర్ విద్యార్థులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. టీచర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి అరవింద్ మోహన్ శర్మ తెలిపారు.