IT Notice | అలీగఢ్ : నెలకు రూ.15,000 జీతం పొందుతున్న యూపీ వ్యక్తికి రూ.33.88 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను(ఐటీ) నోటీసు రాగా నెలకు రూ. 8,500 ఆదాయం పొందుతున్న మరో వ్యక్తికి రూ. 3.87 కోట్లకు ఐటీ నోటీసు వచ్చింది. మరో బడుగుజీవికి కూడా రూ.7.79 కోట్ల ఐటీ నోటీసు అందింది. వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులకు మార్చిలో ఐటీ నోటీసులు వచ్చాయి.