లక్నో: వీధిలో రద్దీ నేపథ్యంలో మంత్రి మేనల్లుడు, పూల వ్యాపారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ రాజీపడ్డారు. అయితే వారు కొట్టుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (UP Minister’s Nephew, Vendors Exchange Blows) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 22న బీజేపీకి చెందిన మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు నిఖిల్ తోమర్, పూల షాపులతో ఇరుకుగా ఉన్న వీధిలో మహీంద్రా స్కార్పియోను డ్రైవ్ చేశాడు. ఎదురుగా ఈ ఆటో రావడంతో వాహనాన్ని నిలిపాడు.
కాగా, వాహనం వెళ్లేందుకు దారి లేకపోవడంతో అక్కడున్న ఒక పూల వ్యాపారితో నిఖిల్ వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరుగడంతో ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో నిఖిల్ ఆ వ్యాపారిని కొట్టగా అతడు ప్రతిఘటించాడు. ఆ వ్యాపారికి చెందిన మహిళ కూడా నిఖిల్‌పై తిరగబడింది. దీంతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత నిఖిల్ తన వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు ఈ సంఘటన తర్వాత ఇరువర్గాల వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పరస్పరం ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తుల ప్రమేయంతో వారు రాజీపడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP BJP minister @isomendratomar’s nephew seen beating a poor flower vendor over a free bouquet.
Ram Rajya! pic.twitter.com/UfWVjDtfmj
— Manish RJ (@mrjethwani_) February 23, 2025