లక్నో : యూపీలోని బహ్రెయిచ్‌లో నాయిబ్ తహశీల్దారు శైలేష్ కుమార్ అవస్థి కారు ఓ యువకుడి మృతదేహాన్ని 30 కిలోమీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. నరేంద్ర కుమార్ హల్దార్(35) బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, నాన్పర-బహ్రెయిచ్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు. ఆయన మృతదేహం తహశీల్దార్ కారు కింద చిక్కుకుంది. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కారును వెనుకకు మళ్లిస్తుండగా, మృతదేహం కనిపించింది. అది కారు కింద ఉన్నట్లు తమకు తెలియదని వీరు చెప్తున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.