లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం 53 స్థానాల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన జడ్పీ సభ్యులంతా ఐక్యతతో ఉండాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, చందౌలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన రామ్‌కిషన్ యాదవ్, పార్టీ సభ్యుల కాళ్లకు మొక్కారు. అంతా కలిసి ఉండి పార్టీ అభ్యర్థిని జడ్పీ ఛైర్‌పర్సన్‌గా గెలిపించాలని కోరారు. రామ్‌కిషన్ మేనల్లుడు తేజ్ నారాయణ్ యాదవ్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మేనల్లుడి గెలుపు కోసం రామ్‌కిషన్ పార్టీ సభ్యుల కాళ్లకు మొక్కారు. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే పార్టీ గౌరవం, గెలుపు కోసం ఎవరి కాళ్లకైనా తాను మొక్కుతానని రామ్‌కిషన్ యాదవ్ అన్నారు.
In a bid to seek support ahead of the Zila panchayat president election in UP's Chandauli, former Samajwadi Party MP Ramkishun Yadav fell at the feet of zila panchayat members during a meeting. pic.twitter.com/g1u8fHEYOQ
— Piyush Rai (@Benarasiyaa) July 3, 2021