లక్నో: నిందితుల కులం ఆధారంగా(Caste-Based Encounters) ఎన్కౌంటర్లు జరుగుతున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆ ఆరోపణలను యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఎవరి పట్ల పక్షపాతాన్ని ప్రదర్శించడం లేదన్నారు. ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్ ఈవెంట్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ఓ జ్వలరీ షాపులో జరిగిన 1.5 కోట్ల లూటీ కేసులో మంగేశ్ యాదవ్ అనే నిందితుడుని ఎన్కౌంటర్ చేశారని, సుల్తాన్పుర్లో కులం ఆధారంగా ఆ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆ ఎన్కౌంటర్ ఫేక్ అని పేర్కొన్నారు. నిందితుడి కులం ఆధారంగా ఆ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిపారు. ఆ ఆరోపణలను డీపీజీ కుమార్ ఖండించారు. పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లు జరపరని, పోలీసులపై బుల్లెట్లు ఫైర్ చేసిన సమయంలో ఏం జరుగుతుందో మాజీ ఆఫీసర్లకు తెలుసు అని, నిష్పక్షపాతంగా ఈ ఘటనపై విచారణ చేపటనున్నట్లు ఆయన తెలిపారు. కాలింది ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన గుచించి పోలీసులు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సీనియర్ ఆఫీసర్లు స్పాట్ వద్దకు వెళ్లారని, విచారణ పూర్తి అయిన తర్వాత వివరాలు వెల్లడించనున్నట్లు డీజీపీ తెలిపారు.