న్యూఢిల్లీ: ఈనెల 14వ తేదీ వరకు పంజాబ్ పోలీసు(Punjab Police)లకు లీవ్‌లను రద్దు చేశారు. ఖలిస్తానీ నేత అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) సిక్కులతో భారీ మీటింగ్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి అమృత్‌పాల్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. సిక్కు(Sikhs) మతస్తుల సంఘం అకాల్ తక్త్ భారీ సభనుఏర్పాటు చేయనున్నది. ఏప్రిల్ 14వ తేదీన బైసాకీ పర్వదినం నేపథ్యంలో ఈ మీటింగ్‌ను నిర్వహించాలనుకుంటున్నారు. అయితే అప్పటి వరకు లీవ్(Leaves)లను రద్దు చేయాలని పంజాబ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సాంక్షన్ చేసిన లీవ్‌లను రద్దు చేశారు. కొత్త లీవ్‌లు ఇవ్వడంలేదు.