బెంగళూరు : బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సోమవారం అనూహ్య సంఘటన జరిగింది. లావేటరీ కోసం వెతుకుతూ ఓ ప్రయాణికుడు కాక్పిట్ ప్రవేశ ప్రాంతంలోకి వెళ్లారు. సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు.
వారణాసి విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి, పోలీసులకు అప్పగించారు. వారణాసిలోని ఫూల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, కాక్పిట్ తలుపును తెరిచేందుకు ప్రయత్నించినట్లు ఒక వ్యక్తిపై కేసు నమోదైనట్లు చెప్పారు.