న్యూఢిల్లీ, డిసెంబర్ 27: బుల్లి రోబోల తయారీలో అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్ వర్సిటీ పరిశోధకులు తాజాగా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మ పరిమాణంలోని స్వతంత్ర రోబోలను వారు సృష్టించారు. ఇవి 200(మైక్రోమీటర్లు) పొడవు 300 వెడల్పు 50 ఎత్తు పరిమాణంలో ఉంటాయి.
కాంతి ద్వారా శక్తిని పొందే ఈ చిట్టి రోబోలు స్థానిక ఉష్ణోగ్రతలను పసిగట్టి ముందుకు కదులుతాయి. అతి చిన్న సాధనాలను రూపొందించటంలో ఇవి కీలకంగా మారనున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఎల్ఈడీ కాంతిలోనూ ఇవి చార్జింగ్ అయ్యే వీలుంటుంది.