న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు టెలికంశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులు స్వచ్ఛంద పదవీవిరమణ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉద్యోగుల పనితీరును ప్రతీనెలా అంచనా వేస్తానని తెలిపారు. సరిగ్గా పనిచేయని వారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి, ఇంటికి పంపిస్తామని పేర్కొన్నారు. రైల్వేశాఖలో కూడా ఇటీవల ఇదే జరిగిందని గుర్తుచేశారు. ఈ మేరకు సీనియర్ మేనెజ్మెంట్ సభ్యులతో జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో టేపు లీకైంది.