భోపాల్: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) చిన్న కుమారుడు కునాల్ చౌహాన్‌కు భోపాల్‌కు చెందిన డాక్టర్ ఇందెర్మల్ జైన్ మనవరాలు రిధి జైన్‌తో పెళ్లి జరుగనున్నది. ఈ నేపథ్యంలో గురువరాం హల్దీ వేడుకలో శివరాజ్ సింగ్ చౌహాన్ సందడి చేశారు. తన భార్య సాధనా సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్న కుమారుడు కునాల్ చౌహాన్, రిధి జైన్ జంటకు గత ఏడాది మే 23న నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసంలో జరుగుతున్న కుమారుడి పెళ్లి వేడుకకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, బీజేపీ పార్టీ నేతలు హాజరయ్యారు.
A video of Union Minister Shivraj Singh Chouhan dancing with his wife Sadhna Singh at their son’s Haldi ceremony at their residence in Bhopal garnered the attention of netizens. #Watch
Chouhan’s younger son Kunal Chouhan is set to tie knot with Ridhi Jain, granddaughter of Dr… pic.twitter.com/m7BG9G7mC8
— Mirror Now (@MirrorNow) February 13, 2025