లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీరట్ రాజధానిగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని ఆయన పేర్కొన్నారు. మీరట్లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ జాట్ పార్లమెంట్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘పశ్చిమ యూపీ రాష్ట్రం కావాలి, మీరట్ దాని రాజధాని కావాలి’ అని అన్నారు.
‘ఈ రీజియన్లో 8 కోట్ల మంది జనాభా ఉన్నారు. హైకోర్టు అయితే ఇక్కడికి 750 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ పూర్తిగా సమర్థనీయమే’ అని వ్యాఖ్యానించారు.