ఇంఫాల్: కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై నిరసనకారులు దాడికి దిగారు. ఇంఫాల్‌లో మణిపూర్ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించగా మంత్రి నివాసం వద్దకు ర్యాలీ చేరుకోగానే కొంతమంది ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్‌లో సర్వ ఆదివాసీ సమాజ్ బంద్ పాటించింది.