జైపూర్: కేంద్ర న్యాయశాఖ మంత్రి, బీజేపీ నేత అర్జున్‌రామ్ మేఘ్వాల్ నంబర్‌వన్ అవినీతిపరుడు.. అంటూ రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ మేఘ్వాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే తప్పించాలని ప్రధాని మోదీని కోరారు. బిల్వారాలో ఆయన మాట్లాడారు. ‘అర్జున్‌రామ్ మేఘ్వాల్ నంబర్‌వన్ అవినీతిపరుడు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే ఆయన రాజకీయాల్లో చేరాడు. ప్రభుత్వ అధికారిగా కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఆయన అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాయబోతున్నా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.