భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై (Jyotiraditya Scindia) తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఆయనతోపాటు వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈ సంఘటన జరిగింది. శనివారం మాధవ్ నేషనల్ పార్క్‌ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. చాంద్‌పథ సరస్సులోని గుర్రపుడెక్కను తొలగించే డ్రెడ్జింగ్ యంత్రాన్ని ప్రారంభించేందుకు అక్కడకు వచ్చారు.
కాగా, ఇంధన మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి జ్యోతిరాదిత్య సింధియా ఆ యంత్రం వద్దకు చేరుకున్నారు. అయితే తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. దీంతో జ్యోతిరాదిత్య సింధియా, సెక్యూరిటీ సిబ్బంది, పలువురు అధికారులతో సహా 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో డ్రెడ్జింగ్ యంత్రాన్ని ప్రారంభించకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Swarm Of Bees Attack Minister Jyotiraditya Scindia In Shivpuri, Several Injured#MadhyaPradesh #MPNews #Jyotiradityascindia pic.twitter.com/Ls23wLa1GU
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 30, 2024