Nambala Keshava Rao | ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో నంబాలకేశవరావు మృతి.. ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Nambala Keshava Rao | ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి.
Nambala Keshava Rao | ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. నంబాళ్ల మృతిపై కోటి రివార్డు ఉందన్న పోలీసులు తెలిపారు. అయితే, నంబాళ్ల కేశవరావు మృతిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఓ మైలురాయి విజయం సాధించామని.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 27 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయని పేర్కొన్నారు.
ఇందులో సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నేత, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం ఉన్నారని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నేతను దళాలు మట్టుబెట్టడం ఇదే తొలిసారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలను అభినందించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా 54 మంది అరెస్ట్ అయ్యారని.. 84 మంది నక్సల్స్ లొంగిపోయారన్నారు. మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని అంతమొందిస్తామని షా స్పష్టం చేశారు.
A landmark achievement in the battle to eliminate Naxalism. Today, in an operation in Narayanpur, Chhattisgarh, our security forces have neutralized 27 dreaded Maoists, including Nambala Keshav Rao, alias Basavaraju, the general secretary of CPI-Maoist, topmost leader, and the…
— Amit Shah (@AmitShah) May 21, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

