Omicron alert : ఒమిక్రాన్ వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు
Omicron alert | న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖలు రాశారు.

Omicron alert | న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆఫ్రికాలో ఆ వేరియంట్ ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆరోగ్యశాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. భారత్‌లో కూడా ప్రధాని నరేంద్రమోదీ నిన్న ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా కొత్త వేరియంట్ గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు.
కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖల్లో రాజేశ్ భూషణ్ కోరారు. కొవిడ్ నిబంధనలన కఠినతరం చేయాలని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడితే ఆ వైరస్ సోకిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

