Union Budget 2022 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో 2022-2023 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆమె డిజిటల్ పద్ధతిలో (కాగిత రహితంగా) వరుసగా రెండోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది నాలుగోసారి. కేంద్ర బడ్జెట్ను సీతారామన్ గంటన్నర పాటు చదివి వినిపించారు. కేంద్ర బడ్జెట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్తో భేటీ అయి.. బడ్జెట్ విషయాలను వివరించారు.