New Study : అధికంగా ప్రాసెస్ చేసిన మొక్కల ఆధారిత ఆహారాలతో గుండె జబ్బుల రిస్క్‌తో పాటు అకాల మరణం ముప్పు అధికమని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్‌కు చెందిన 18,000 మందికిపైగా ప్రజల ఆహారపు అలవాట్లు వారికి ఎదురైన ఆరోగ్య సమస్యలను దీర్ఘకాలం పరిశీలించిన మీదట యూకే బయోబ్యాంక్ డేటా ఈ వివరాలను వెల్లడించింది.
అత్యధికంగా ప్రాసెస్ చేయబడిన మొక్కల ఆధారిత ఆహారాలతో హృద్రోగ ముప్పు 5 శాతం, అకాల మరణం ముప్పు 13 శాతం పెరుగుతుందని పేర్కొంది. సాసేజ్లు, నగ్గెట్స్, బర్గర్స్ వంటి ప్లాంట్ బేస్డ్ మాంస ఉత్పత్తులను కూడా ఈ అధ్యయనం పరిశీలించి వీటిని అత్యధిక ప్రాసెస్డ్ ఆహారాలుగా పేర్కొంది. ప్యాకేజ్డ్ బ్రెడ్స్, పేస్ట్రీలు, బన్స్, కేక్స్, కుకీస్‌లను ప్రాసెస్డ్ ఆహారాలుగా ఈ అధ్యయనం వర్గీకరించింది.
ప్రాసెస్ చేసే క్రమంలో ఈ ఆహారాలు హీటింగ్, మౌల్డింగ్, కలర్, స్మెల్, టేస్ట్ పెంచేందుకు కెమికల్స్‌ను జోడించడం వంటి ప్రక్రియకు గురవుతాయని పేర్కొంది. ఇక తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు, పాలు, స్వల్పంగా ప్రాసెస్ చేయబడిన సాల్ట్, ఔషధాలు, నూనెలు, క్యాన్డ్ గూడ్స్ వంటి ఆహార పదార్ధాలను ప్రాసెస్ చేయని ఆహార పదార్ధాలుగా అధ్యయనం పేర్కొంది.
ఇక ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్కు గురిచేయడంతో పాటు అనారోగ్య ముప్పును పెంచుతాయని అధ్యయన రచయిత ఫెర్నాంద రౌబర్ పేర్కొన్నారు. తక్కువ ప్రాసెస్ చేయబడిన మొక్కల ఆధారిత ఆహారాలను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
Read More :
Priyanka Gandhi | వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్.. ఉపఎన్నిక బరిలో ప్రియాంక?!