Ujjain | ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో లైంగికదాడికి గురైన పదిహేనేళ్ల బాలికకు సాయపడని వారిపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ జయంత్ సింగ్ రాథోడ్ తెలిపారు.
ఆమెకు జరిగిన దారుణం గురించి తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం అందించని ఆటో డ్రైవర్‌ను గుర్తించామన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, ఇటువంటివారిని గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఓ గుడి పూజారి ఆమెకు రక్షణ కల్పించి, పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు.