న్యూఢిల్లీ : ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్లను తమ స్మార్ట్ఫోన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అవకాశం కల్పించింది.
బుధవారం నుంచి ఎక్కడి నుంచి అయినా, ఏ సమయంలోనైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఫోన్ నంబర్ అప్డేట్ కోసం ఇకపై ఎన్రోల్మెంట్ కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. కొత్తగా అమల్లోకి వచ్చిన విధానంలో ఫేస్ ఆథెంటికేషన్, ఓటీపీ ద్వారా మొబైల్ నంబర్ అప్డేట్ జరుగుతుంది.