న్యూఢిల్లీ: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైస్ చాన్సలర్ల నియామకంలో భారీ ప్రక్షాళనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రతిపాదించింది.
వీసీలుగా నియమించేందుకు పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ పాలన, ప్రభుత్వ విధానం, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సీనియర్ ఫ్రొఫెషనల్స్ త్వరలోనే అర్హులు కానున్నట్లు యూజీసీ కొత్త నిబంధనలు ప్రతిపాదిస్తున్నాయి. ఫ్యాకల్టీ నియామకంలోనూ కీలక మార్పులు రానున్నాయి.