న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీనెట్) – డిసెంబర్ 2022 సెషన్ ఫలితాలను యూజీసీ గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు ugcnet. nta.nic.in, ntaresults. nic.in వెబ్సైట్లలో లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్లలో లాగిన్ కావడానికి అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను యూజర్ నేమ్‌గా, పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఉపయోగించాలి.