న్యూఢిల్లీ, అక్టోబర్ 17: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వాట్సాప్ చానల్‌ను ప్రారంభించింది. ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి ఈ చర్యలు చేపట్టింది. ఈ చానల్ వల్ల కీలక సమాచారాన్ని, పెరుగుతున్న అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉంటుంది. యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ చానల్‌ను ప్రారంభించడం ఉన్నత విద్యా రంగంలో ఓ కీలక అడుగని చెప్పారు.