హేమంత్ కుమార్, అయానా, గోపిక సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ చిత్రం ‘ఆల్ఫా’. ‘మెన్ లవ్ వెంజన్స్’ ఉపశీర్షిక. విజయ్ ఎన్ దర్శకుడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు రవిశంకర్, మంజునాథ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
యాక్షన్, మాఫియా ఎలిమెంట్స్, ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. నేటి తరానికి నచ్చే కంటెంట్‌తో రూపొందించిన చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. అచ్యుత్ కుమార్, బాలు నాగేంద్ర, కార్తీక్ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జె అనూప్ సీలిన్, నిర్మాత: ఆనంద్‌కుమార్, దర్శకత్వం: విజయ్ ఎన్.