రెమ్యునరేషన్ లేకుండా సినిమా
సినిమా కళాత్మక వ్యాపారం. ఇక్కడ తారలు తమ ఇమేజ్ను బట్టి పారితోషాకాల్ని డిమాండ్ చేస్తుంటారు. ఇక అగ్ర తారలైతే రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం రాజీపడరు.
సినిమా కళాత్మక వ్యాపారం. ఇక్కడ తారలు తమ ఇమేజ్ను బట్టి పారితోషాకాల్ని డిమాండ్ చేస్తుంటారు. ఇక అగ్ర తారలైతే రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం రాజీపడరు. కానీ ఈ ధోరణికి భిన్నంగా అగ్ర కథానాయిక తమన్నా ‘ఓ రోమియో’ అనే హిందీ సినిమాలో అతిథి పాత్రలో నటించినందుకుగాను ఎలాంటి పారితోషికాన్ని తీసుకోలేదట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. షాహిద్‌కపూర్, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రచార కార్యక్రమాల సందర్భంగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ రెమ్యునరేషన్ల అంశం గురించి మాట్లాడారు.
కథానాయిక తమన్నా, ‘12th ఫెయిల్’ ఫేమ్ విక్రాంత్ మస్సే ఈ సినిమాలో అతిథి పాత్రల్లో నటించారని, తనతో ఉన్న స్నేహసంబంధాలతో పాటు ఓ మంచి కథకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో వారిద్దరూ పైసా పారితోషికాన్ని తీసుకోకుండానే నటించారని, ఈ రోజుల్లో అంతటి ఉదార స్వభావం ఉన్న వారు అరుదని ప్రశంసించారు. గెస్ట్‌రోల్ కోసం కొన్ని రోజులే కేటాయించినా.. ఇప్పుడున్న వ్యాపార దృక్కోణంలో ఉచితంగా నటించడం గొప్ప విషయమని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. గత ఏడాది వచ్చిన ‘ఓదెల-2’ తర్వాత తెలుగులో తమన్నా మరే చిత్రానికి సైన్ చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

