న్యూఢిల్లీ, అక్టోబర్ 11: కాలేజీ ఫీజులు, హాస్టల్ వసతి, కాలేజీ ర్యాంకింగ్.. తదితర సమాచారాన్ని కాలేజీలు, యూనివర్సిటీలు తమ అధికారిక వెబ్సైట్లలో పొందుపరచాలని యూజీసీ ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల వెబ్సైట్లలో కనీస సమాచారం ఉండటం లేదని, వీటిలో చాలా నిర్వహణలో లేవని, అప్డేట్ కావటం లేదని యూజీసీకి ఫిర్యాదులు అందాయి.
ఈనేపథ్యంలో తాజా ఉత్తర్వులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. పేటెంట్స్ వివరాలు, క్వాలిటీ అస్యూరెన్స్ సెల్, ఫిర్యాదు కమిటీ, యాంటీ ర్యాగింగ్ సెల్.. మొదలైనవాటి వివరాలు హెల్ప్‌లైన్ నంబర్‌తో సహా వెబ్సైట్లలో పొందుపర్చాలని యూజీసీ ఓ చెక్లిస్ట్ను విడుదల చేసింది.