హిజబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని ఉడుపి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ 144 సెక్షన్ ఈ నెల 19 వరకూ అమలులో వుంటుందని పేర్కొన్నారు. హిజబ్ వివాదం కారణంగా కర్నాటక ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే దశల వారీగా తిరిగి వాటిని తెరవాలని నిర్ణయించింది. అయితే మొదట పాఠశాలలను తెరవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగానే అధికారులు పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 14 సాయంత్రం 6 గంటల వరకూ అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.