చెన్నై: తమిళిగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ను ఉద్దేశించి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రచారం లేదా, పార్టీ పనుల కోసం తాను ‘వీకెండ్’లో వచ్చే రాజకీయ నాయకుడిని కాదని పరోక్షంగా విజయ్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)పైనా ఉదయనిధి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన తన పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) ముఖాన్ని కూడా మరిచిపోయారని, ఇప్పుడు ఆయనకు అమిత్ షా ముఖం తప్ప మరేదీ గుర్తు రావడం లేదని ఎద్దేవా చేశారు.