Uddhav Thackeray : రాజ్‌కోట్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వాన్ని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తప్పుపట్టారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల ఘటనలపై కూడా షిండే సర్కార్‌పై ఠాక్రే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అవినీతి వ్యవహారాలు అదుపు తప్పాయని ఆరోపించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఎలా కుప్పకూలిందో రెండ్రోజుల కిందట ప్రజలు చూశారని, దీనిపై పాలకులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో గమనిస్తున్నారని అన్నారు.
బలమైన గాలుల కారణంగా విగ్రహం నేలకొరిగిందని వారు చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. గాలులు ఉధృతంగా వీచడంతో విగ్రహం కూలి దెబ్బతిన్నదని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చెబుతున్నారని అన్నారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో 35 అడుగుల శివాజీ విగ్రహం నేలకూలడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు భగ్గుమన్నాయి.
శివాజీ మహరాజ్ సిద్ధాంతంతో ప్రభుత్వం కనెక్ట్ కాలేదని ప్రహర్ జన్‌శక్తి పక్ష్ నేత బచ్చు కదు విమర్శించారు. ఈ ఘటన దురదృష్టకరమని, విగ్రహం నాణ్యత సరిగ్గా లేదని స్వరాజ్య శంభాజీ ఛత్రపతి పేర్కొన్నారు. తాను ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని తెలిపారు. బలమైన గాలుల వల్లే విగ్రహం నేలకొరిగిందని పాలకులు చెప్పడం హాస్యాస్పదమని, ఇది మీ బాధ్యత, దీనికి జవాబుదారీతనం మీదేనని షిండే సర్కార్‌ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
Read More :
Kangana Ranaut | బాలీవుడ్ ఓ నిస్సహాయ ప్రదేశం.. ఇక్కడ టాలెంట్‌ను చూసి అసూయ పడతారు : కంగన రనౌత్