ఉద్ధవ్, షిండే వర్గాల ఎమ్మెల్యేలకు… ఫిరాయింపుపై షోకాజ్ నోటీసులు
ముంబై: మహారాష్ట్రలోని శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు అందాయి. మహారాష్ట్ర శాసనసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇరు వర్గాల నుంచి అందిన దరఖాస్తులపై అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ స్పందించారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ 53 మంది శివసేన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 39 మంది తిరుగుబాటు షిండే వర్గానికి చెందిన వారు కాగా, 14 మంది మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే వెంట ఉన్నారు.
కాగా, ఈ నెల 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. స్పీకర్ ఎన్నిక, సీఎం షిండే బలనిరూపణ సందర్భంగా శివసేన రెండు వర్గాలు పోటాపోటీగా విప్ జారీ చేశాయి. ఈ నెల 3న జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ గెలిచారు. అలాగే ఆ మరునాడు జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం షిండేకు అనుకూలంగా 164 మంది, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో బలపరీక్షలో సీఎం షిండే విజయం సాధించారు.
మరోవైపు విప్ను ధిక్కరించినందుకు రెబల్ గ్రూప్ చీఫ్ విప్, షిండే విధేయుడు భరత్ గోగావాలే, ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే పేరును అనర్హత వేటు జాబితాలో పేర్కోలేదు. కాగా, ఉద్ధవ్ వర్గం కూడా విప్ ధిక్కారం, ఫిరాయింపులపై ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో శివసేన ఇరు వర్గాలకు చెందిన 53 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ తెలిపారు. ‘ఏదైనా దరఖాస్తు వచ్చినప్పుడు, మేం దానిపై చర్యలు తీసుకుటాం. దీంతో ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకు నోటీసు జారీ చేశాం’ అని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

