కాలిఫోర్నియా, జూలై 19: భారత సంతతికి చెందిన ప్రముఖ టెక్ నిపుణుడు ఉదయ్ రుద్దరాజు ఏఐ(కృత్రిమమేధ) రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ‘ఓపెన్ ఏఐ’లో కీలక పదవికి ఎంపికయ్యారు. కంపెనీలో ఒక సంవత్సరంపాటు ‘హెడ్ ఆఫ్ కంప్యూట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను ‘చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) ఆఫ్ కంప్యూట్’గా ప్రమోట్ చేసినట్టు ‘ఓపెన్ ఏఐ’ ప్రకటించింది. ‘సీటీవోగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని ఉదయ్ తెలిపారు.