న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఉబెర్ క్యాబ్‌లను బుక్ చేయాలంటే ఇకపై ప్రత్యేకంగా యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోనక్కర్లేదు. నేరుగా వాట్సాప్ నుంచి బుక్ చేయవచ్చు. ఉబెర్, వాట్సాప్ ఈ మేరకు ఒప్పందం చేసుకొన్నాయి. రైడింగ్ సేవల్లో రెండు సంస్థలు భాగస్వాములుగా మారాయి. ఉబెర్‌లో యూజర్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రైడ్ పూర్తయ్యాక వచ్చే రసీదు దాకా.. ప్రతీది వాట్సాప్‌లోనే పొందవచ్చు. ఈ సేవలను దేశంలో మొదటగాయూపీలోని లక్నోలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. తర్వాత దేశం అంతటికీ విస్తరిస్తారు. ఈ సేవలు ప్రస్తుతం కేవలం ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు మిగతా భాషల్లో సేవలు పొందడానికి కొంత కాలం పడుతుందని ఉబెర్ ప్రకటించింది. వాట్సాప్ ద్వారా ఉబర్ బుకింగ్ కోసం.. ఉబెర్ సంస్థ ‘వాట్సాప్ బిజినెస్ అకౌంట్’ను ఓపెన్ చేస్తుంది. వినియోగదారులు ఈ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా క్యాబులు, ఆటోలు, బైకులు బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు క్యూఆర్ కోడ్, ఉబెర్ సంస్థ అందించే లింక్‌తో కూడా క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు.